హైదరాబాద్, ఫిబ్రవరి19 (నమస్తే తెలంగాణ): హైకోర్టు తీర్పును అనుసరించి కొత్త ని యామకాలకు ముందుగానే గురుకులాల్లోని ఉ ద్యోగ, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదిలీలు కల్పించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) స్టాఫ్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మిని స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు బీవీ కృష్ణారెడ్డి, కార్యదర్శి వడ్డేపల్లి ప్రభుదాస్, ట్రెటా అధ్యక్షుడు రిషికేశ్ కుమార్ సోమవారం ప్రత్యేకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. హైకోర్టు ఉత్తర్వులను పరిగణలోకి తీసుకొని గురుకులాల్లో వెంటనే జీవో 317 ప్రకారం చేసిన బదిలీలు చేపట్టాలని కార్యదర్శిని కోరారు. తర్వాత, ఇదే విషయమై.. బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టును వారు కలిసి వినతిపత్రం అందజేశారు.
డీఎల్, జేఎల్ పోస్టులకు డెమోల షురూ..
గురుకుల డిగ్రీ, జూనియర్ కాలేజీల్లోని లెక్చరర్ పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడిన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు(ట్రిబ్) చర్యలు చేపట్టింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచే అభ్యర్థులకు డె మోలు ప్రారంభించింది. తెలుగు, ఇంగ్లిష్, ఉ ర్దూ, బాటనీ, మ్యాథమెటిక్స్ తదితర సబ్జెక్టుల వారీగా, అభ్యర్థులకు డెమోలు నిర్వహించింది. మంగళవారమూ డెమోలు కొనసాగుతాయి.