హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): టీజీ జెన్కో అకౌంట్స్ ఆఫీసర్స్‌కు శుక్రవారం పదోన్నతులు కల్పించారు. 29 మంది జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లకు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లుగా, 17మంది అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లకు అకౌంట్స్ ఆఫీసర్లుగా, 14 మంది అకౌంట్స్ ఆఫీసర్లకు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పిస్తూ జెన్కో సీఎండీ రోనాల్డ్‌రోస్ ఉత్తర్వులిచ్చారు. పదోన్నతి కల్పించడంతోపాటు పలు జనరేటింగ్ స్టేషన్లు, కార్యాలయాల్లో పోస్టింగ్స్‌ను సైతం కల్పించారు.