హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖలోని ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న ఓ డిప్యూటీ డైరెక్టర్‌కు ప్రభుత్వం నుంచి చార్జ్ మెమోలు జారీ అయినప్పటికీ, జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించడం చర్చనీయాంశంగా మారింది. నిరుడు జరిగిన తప్పిదాలు, నిర్లక్ష్యంతో సదరు అధికారిణిని సర్కారు చార్జ్ మె మోలు జారీ చేసింది. విధుల్లో నిర్ల క్ష్యం, విజిలెన్స్, ఏసీబీ కేసులు వం టివి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను పదోన్నతుల లిస్టులో పెండింగ్ పెడతారు. డీపీసీ (డిపార్ట్మెంట్ ప్రమోషనల్ కమిటీ) వీటన్నింటిని పరిశీలించిన తర్వాతే పదోన్నతి కల్పిస్తారు. ఈక్రమంలో వైద్యారోగ్యశాఖ సాధారణ బదిలీల సమయంలో పోస్టింగ్‌లు, మాడిఫికేషన్ సమయంలో కొందరు ఆఫీసర్లు, ఉద్యోగులకు భారీగా ముడుపులు అందాయని పలువురు ఆరోపించారు.
వారిలో ఇప్పుడు పదోన్నతి పొందిన అధికారి కూడా ఉండటం గమనార్హం. వైద్యారోగ్యశాఖలో 2024-2025 ప్యానల్ ఇయర్లో అడ్మినిస్ట్రేషన్ విభాగంలోని ముగ్గురు గ్రూప్-1 ఆఫీసర్లకు ప్రమోషన్ ఇస్తూ హెల్త్ సెక్రటరీ ఉత్తర్వులిచ్చారు. డీడీగా పనిచేస్తున్న కృష్ణవేణికి జేడీగా ప్రమోషన్ ఇచ్చారు. శ్వే తా మొంగాకు జేడీగా ప్రమోట్ చేస్తూ మెడికల్ బోర్డులో పోస్టు ఇచ్చారు. మంజునాథ్‌కు జేడీగా ప్రమోషన్ ఇస్తూ ఎన్హెచ్ఎంలో పోస్టు ఇచ్చారు. వీరిలో ఒకరికి మెమో ఇచ్చిన విషయా న్ని డీపీసీ గుర్తించకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తున్నది. దీనిపై వైద్యారోగ్యశాఖ మంత్రికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ఆరోగ్యశాఖలో ముగ్గురికి పదోన్నతి
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖలోని ముగ్గురు డిప్యూటీ డైరెక్టర్లకు జా యింట్ డైరెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీఎం ఈ కార్యాలయానికి ఎన్ కృష్ణవేణిని, ఎంహెచ్ఎస్ఆర్బీకి శ్వేత మొంగ, ఎన్హెచ్ఎం సీఐవోగా బీ మంజునాథ్ నా యక్‌ను నియమించింది. వీరితోపాటు సివిల్ సర్జన్లుగా ప్రమోషన్లు పొందిన 36 మందికి పోస్టింగ్స్ ఇస్తూ ఆదేశాలిచ్చింది.