మేమేం పాపం చేసినమని.. మాపై ఎందుకిలా కక్షపూరితంగా మాట్లాడుతున్నరో అర్థం కావడం లేదు. బీజేపీ నాయకుడు కొన్ని రోజులుగా మోటర్లకు మీటర్లు పెడుతామంటున్నడు. నిన్న మొన్న కాంగ్రెస్ నాయకుడు 3 గంటల కరెంటు ఇస్తే సరిపోతది.. అంతకన్నా ఎక్కువ కరెంటు ఎందుకు అంటున్నడు. మా గ్రామంలో రైతులంతా బోర్లపైనే ఆధారపడి ఎవుసం చేస్తరు. ప్రస్తుతం వర్షాల్లేవు. బోర్లు తక్కువ నీళ్లు పోస్తున్నయి. ఇప్పుడు నేను దుక్కి దున్నుతున్న.
రెండున్నర ఎకరాలు తడవడానికి చాలా సమయం పడుతది. మూడు, నాలుగు గంటల కరెంటు ఇస్తే ఏం సరిపోతది? మా నాన్నకు పది ఎకరాల భూమి ఉన్నది. ఇద్దరం కొడుకులం. నేను డిగ్రీ వరకు చదువుకున్న. తాతల కాలం నుంచి ముళ్ల కంచె, పలుగు రాళ్లుగా ఉన్న భూమిని రైతుబంధుకు తోడు కొన్ని డబ్బులు కలిపి సాగు భూమిగా మార్చుకున్న. తెలంగాణ వచ్చాక వ్యవసాయానికి పెట్టుబడి తక్కువగా ఖర్చవుతుండటంతో మంచి లాభసాటిగా ఉంది. దీని కన్నా మించిన ఉద్యోగం లేదని ఎవుసం చేస్తున్న. గతంలో లాగా మళ్లీ కరెంటు కోతలు ఉంటే.. ఎవుసం బందు చేసుకొని ఏదైనా దుకాణంలో జీతం ఉండాల్సిందే. తెలంగాణ రైతుల అదృష్టం కొద్ది ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు.
– ఉప్పునూతల రమేశ్, రైతు, చిన్నకొండూరు, చౌటుప్పల్ మండలం