హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): తండ్రి మరణించిన నేపథ్యంలో బుధవారం అనేకమంది ప్రముఖులు, పార్టీల నేతలు, అభిమాను లు మాజీ మంత్రి హరీశ్‌రావును పరామర్శించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత లు కేవీపీ రామ్‌చందర్‌రావు, మధుయాష్కిగౌడ్, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తదితరులు పరామర్శించారు. అంతకుముందు సత్యనారాయణరావు చిత్రపటం వద్ద పుష్పాభిషేకం చేసి నివాళులర్పించారు.