మినీ అంగన్వాడీల అప్‌గ్రేడ్
రాష్ట్రంలోని 3,865 మినీ అంగన్వాడీలను ప్రధాన కేంద్రాలుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో ఆరోగ్యలక్ష్మి, గిరిపోషణ్, బాలామృతం, బాలామృతం ప్లస్ వంటి కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నా యి.
- కేంద్రానికి తెలంగాణ ప్రతిపాదన
- 3,865 కేంద్రాల అప్‌గ్రేడ్‌కు నివేదన
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 3,865 మినీ అంగన్వాడీలను ప్రధాన కేంద్రాలుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో ఆరోగ్యలక్ష్మి, గిరిపోషణ్, బాలామృతం, బాలామృతం ప్లస్ వంటి కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నా యి. ఈ నేపథ్యంలో మారుమూల ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న మినీ అంగన్వాడీల నిర్వహణ మరింత పారదర్శకంగా, పకడ్బందీగా చేసేందుకు వీలుగా వాటి ని మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ కేంద్ర ప్రభుత్వానికి నివేదించినట్టు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి.
ఇందులో 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు కాగా, 3,889 మినీ అంగన్వాడీలు ఉన్నా యి. మెయిన్ అంగన్వాడీల్లో ఒక టీచర్, ఒక సహాయకురాలు ఉంటారు. మినీ అంగన్వాడీల్లో సహాయకురాలు మాత్రమే పనిచేస్తున్నారు. పరిపాలన వికేంద్రీకణ కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీల సంఖ్యను పెం చటమే కాకుండా తండాలు, ఆదివాసీ గూడెలకు పంచాయతీ హోదా కల్పించింది.
దాదాపు రాష్ట్రంలో ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ఒక ప్రధాన అంగన్వాడీ లేదా మినీ అంగన్వాడీ ఉన్నాయి. స్త్రీ, శిశు సంరక్షణలో రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు చేపట్టింది. కరోనా సమయంలో రెండేండ్లు ఇంటింటికీ రేషన్‌ను పంపిణీ చేసి కేంద్ర ప్రభుత్వ అవార్డులను సొంతం చేసుకున్నది. మినీ అంగన్వాడీలపై పని ఒత్తిడి నేపథ్యంలో వాటిని ఉన్నతీకరీంచాలని కేంద్రానికి నివేదించింది. అప్‌గ్రేడ్ చేసే మినీ అంగన్వాడీల పరిధిలోని జనాభా, ఆరేండ్లలోపు చిన్నారులను పరిగణనలోకి తీసుకొని స్త్రీ, శిశు సంక్షేమశాఖ కసరత్తు చేసింది.
- మినీ అంగన్వాడీల పరిధిలో జనాభా 12,84,339 3
నెలల నుంచి 6 ఏండ్ల చిన్నారులు 90,829
ప్రధాన కేంద్రాలుగా మార్చాలని ప్రతిపాదించిన మినీ అంగన్వాడీలు 3,865
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

