హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) సభ్యుడిగా ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పారిపల్లి శంకర్ నియమితులయ్యారు. దక్షిణ ప్రాంత ఎన్సీటీఈ కమిటీకి ఒక చైర్మన్‌తో పాటు ఐదుగురు సభ్యులను నియమించారు. ఈ కమిటీలో ప్రొఫెసర్ శంకర్‌కు చోటు లభించింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన శంకర్ ఓయూ ఎడ్యుకేషన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
గత కమిటీలోనూ శంకర్ ఎన్సీటీఈ సభ్యుడిగా వ్యవహరించగా, ఆయన సేవలను గుర్తించి రెండోసారి అవకాశం కల్పించారు. రాష్ట్రంలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ వర్సిటీ ప్రొఫెసర్ ఎం వనజ కూడా దక్షిణ ప్రాంత ఎన్సీటీఈ సభ్యురాలిగా నియమితులయ్యారు. తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు కొత్త కమిటీలను నియమిస్తూ ఎన్సీటీఈ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ కమిటీలు రెండేండ్ల పాటు అమల్లో ఉంటాయని ఎన్సీటీఈ సభ్యకార్యదర్శి కేసాంగ్ వై షెర్పా వెల్లడించారు.