హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగ యువత కోరుతున్నట్టు డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కోరారు.
డీఎస్సీకి, గ్రూప్ 2 పరీక్షలకు వ్యవధి తక్కువగా ఉన్నందుకు ప్రభుత్వం, టీజీపీఎస్సీ పునరాలోచించాలని కోరామని మంగళవారం విడుదల చేసిన వీడియోలో తెలిపారు.
రాష్ట్రంలో పోటీ పరీక్షల అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రొఫెసర్ హరగోపాల్‌తో కలిసి మంగళవారం టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డితో భేటీ అయ్యామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆవేదన, ఆందోళనను చైర్మన్ మహేందర్‌రెడ్డికి వివరించామని పేర్కొన్నారు.