హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈనెల 16న ‘రైతునేస్తం’ కార్యకమాన్ని నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహిచిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి రైతులతో ముఖాముఖి మాట్లాడతారని చెప్పారు.
ఈ కార్యక్రమాన్ని రైతునేస్తం కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారని తెలిపారు. నిపుణులతో మాట్లాడి రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నేడు(శనివారం) జరగనున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమ ఏర్పాట్లపైనా డీజీపీ జితేందర్, ఉన్నతాధికారులతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.