ముంచుకొస్తున్న పర్యావరణ ముప్పు
రాష్ట్రంలో గతంతో పోలిస్తే రెండు, మూడేండ్ల నుంచి పంట వ్యర్థాల కాల్చివేత పెరిగిందని, ఈ యాసంగి నాటికి 17లక్షల ఎకరాల్లో పంట వ్యర్థాలను అగ్నికి ఆహుతి చేసినట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం వెల్లడించింది.
- పంట వ్యర్థాల కాల్చివేతతో భారీగా వాయు కాలుష్యం
- రాష్ట్రంలో ఈ యాసంగి నాటికి 17 లక్షల ఎకరాల్లో వ్యర్థాలకు నిప్పు
- గణాంకాలు వెల్లడించిన వ్యవసాయ విశ్వవిద్యాలయం
హైదరాబాద్, జూన్ 24 (నమస్తేతెలంగాణ) : రాష్ట్రంలో గతంతో పోలిస్తే రెండు, మూడేండ్ల నుంచి పంట వ్యర్థాల కాల్చివేత పెరిగిందని, ఈ యాసంగి నాటికి 17లక్షల ఎకరాల్లో పంట వ్యర్థాలను అగ్నికి ఆహుతి చేసినట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం వెల్లడించింది. బుధవారం ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య గణాంకాలు విడుదల చేశారు. విశ్వవిద్యాలయంలో ఇటీవల నెలకొల్పిన అధునాతన ఆర్ఎస్, జీఐఎస్ (రిమోట్ సెన్సింగ్, జియో ఇన్ఫర్మేటిక్ సిస్టం) ప్రయోగశాలలో గత ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉపగ్రహ ఛాయాచిత్రాలను విశ్లేషించి ఈ గణాంకాలు విడుదల చేసినట్లు వెల్లడించారు.
మొత్తం 17లక్షల ఎకరాల్లో వ్యర్థాలను ఆయా పొలాల్లోనే కాల్చగా సుమారు 9 లక్షల ఎకరాల్లో వరి కోత అనంతరం వరి కొయ్యలు, గడ్డిని ఆయా పొలాల్లోనే కాల్చివేసినట్లుగా ఈ గణాంకాలు తెలిపాయి. మిగతా 8 లక్షల ఎకరాల్లో మొకజొన్న, జొన్న పంటల వ్యర్థాలు అగ్నికి అహుతైనట్ట్లు గణాంకాలు వెల్లడించాయి. తెలంగాణాలోని 33 జిల్లాల్లో అత్యధిక పంటవ్యర్థాలను కాల్చివేసిన మొదటి ఐదు స్థానాలలో నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాలు ఉన్నాయని జానయ్య తెలిపారు.
మొత్తం 17 లక్షల పంట వ్యర్థాల కాల్చివేసిన విస్తీర్ణంలో పైఐదు జిల్లాల వాటా 34 శాతం ఉండటం గమనార్హం. అతి తకువ పంట వ్యర్థ్ధాలను కాల్చిన జిల్లాలు రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలని పేరొన్నారు. వ్యర్థ్ధాలను కాలి స్తే నేల, ఆరోగ్యం, గాలి నాణ్యత కలుషితం అవుతాయని, కాల్చివేతను ఉపసంహరించుకోవాలని రైతులను కోరారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే పదేండ్లలో హైదరాబాద్ మరో ఢిల్లీలా మారుతుందని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

