PJTAU | హైదరాబాద్ : ఆగస్టు 2వ తేదీన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ 55వ స్నాతకోత్సవం నిర్వహించనున్నారు. ఈ 55వ స్నాతకోత్సవానికి ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎంఎల్ జాట్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నారు.
మొత్తం 519 మంది అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్టు గ్రాడ్యుయేట్స్, పీహెచ్డీ స్కాలర్స్ తమ డిగ్రీలను అందుకోనున్నారు. మొత్తం 9 మంది విద్యార్థులు(పీజీ, పీహెచ్డీ) గోల్డ్ మెడల్స్ అందుకోనున్నారు. ఇద్దరు పీజీ, పీహెచ్డీ స్టూడెంట్స్ రూ. 25 వేల క్యాష్ ప్రైజ్ అందుకోనున్నారు. మరో 20 మంది అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా బంగారు పతకాలను అందుకోనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఇక స్నాతకోత్సవానికి దరఖాస్తు చేస్తున్న వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.