రవీంద్రభారతి, జనవరి 24: తెలంగాణలో 12 యూనివర్సిటీలలోని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించాలని ప్రముఖ సామాజికవేత్తలు ప్రొఫెసర్ హరగోపాల్, ఎమ్మెల్సీ కోదండరాం కోరారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్ర యూనివర్సిటీ కో ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ‘విశ్వవిద్యాలయాల్లో విద్యాప్రమాణాలు ఒప్పంద అధ్యాపకుల పాత్ర’పై సదస్సు నిర్వహించారు.
వక్తలుగా ప్రొఫెసర్ హరగోపాల్, ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొని మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో కాంట్రాక్ట్ అధ్యాపకుల వ్యవస్థ నెలకొందని, తక్షణమే అధ్యాపకులను క్రమబద్ధీకరించి యూజీసీ స్కేల్ ఇవ్వాలని పేర్కొన్నారు. తెలంగాణలో రోజురోజుకు విద్యాప్రమాణాలు దిగుజారుతున్నాయని వాపోయారు. ఉపేందర్, వేల్పుల కుమార్, విజయేందర్‌రెడ్డి, తాళ్లపల్లె వెంకటేశ్, రేష్మారెడ్డి, కేయూ పాలక మండలి సభ్యులు చిర్ర రాజు, రాజేశ్, దత్తాత్రేయ, గంగకిషన్, స్వప్న, రజని, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.