ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 22: మూసీనది ప్రక్షాళన కోసం కోట్లు ఖర్చు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి నగరంలోని మురికివాడల అభివృద్ధి తక్ష ణ కర్తవ్యంగా ఉండాలని దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. నగరంలోని 775 నోటిఫైడ్ మురికివాడల్లో 30లక్షలకు పైగా ప్రజలు జీవిస్తున్నార ని తెలిపారు. చినుకు పడితే వారి జీవితాలు అతలాకుతలమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాలలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడు తూ మురికివాడల్లో నివసిస్తున్నది దళి త, ముస్లిం, బీసీ, అగ్రకుల పేదలేనని చెప్పారు. వారందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించాల్సిన ప్రభుత్వం దానిని వదిలేసిందని దుయ్యబట్టారు.