హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకుల క్రమబద్ధీకరణ అసాధ్యమని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి స్పష్టంచేశారు. 13రోజులుగా సమ్మె చేస్తున్న అధ్యాపకుల సంఘాల ప్రతినిధులతో జరిపిన చర్చల్లో ఈ విషయాన్ని తేల్చిచెప్పారు.
సాంకేతికంగా క్రమబద్ధీకర ణ సాధ్యంకాదని, న్యాయస్థానాలలో నిలబడదని వెల్లడించారు. చర్చల అనంతరం సమ్మెను విరమిస్తున్నట్టు అధ్యాపక సంఘాల జేఏసీ నేత ధర్మతేజ ప్రకటించారు. కాంట్రాక్టు అధ్యాపకులను తొలగిస్తే ఏర్పడే సమస్యలు, వారికి ఉద్యోగ భద్రత కల్పన, 7వ వేతన సవరణ సంఘం ప్రకారం జీతాలు, డీఏ, ఇంక్రమెంట్ పెంపు ప్రతిపాదనలతో ప్రభుత్వానికి నివేదిక పంపించామని ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. కానీ తుది నిర్ణయం ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పారు.