రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే నిలిచిపోతున్నది. కేంద్రాలు ప్రారంభించిన సర్కార్ కొనుగోళ్లు మాత్రం చేపట్టకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల ఎదుట వాహనాలతో క్యూ కడుతున్నారు. కాంటా చేయక, తరలించేందుకు లారీలు లేక ఆరుబయట కుప్పలు పోసి ఉంచుతున్నారు.
రోజుల తరబడి కాపలా ఉండాల్సి వస్తున్నదని, వానలు పడితే నిండా మునుగుతామని వాపోతున్నారు. అధికారులు వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

వనపర్తి జిల్లా మార్కెట్ యార్డులో పేరుకుపోయిన ధాన్యం కుప్పులు

మహబూబ్నగర్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్ప, తరలింపులో జాప్యంతో పేరుకుపోయిన వడ్ల సంచులు