హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న సుమారు 2,600మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. మొ త్తం 2,600 మందిలో 945 మంది కాంట్రాక్ట్ ప్రతిపాదికన, 1,562 మంది ఔట్సోర్సింగ్, 93మంది మల్టీ టాస్కింగ్ బేసిస్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కార్మికులు తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో వీరంతా ఎక్స్‌రే, ల్యాబ్, ఈసీజీ టెక్నిషియన్లు, బ్లడ్ బ్యాంక్, పేషెంట్ కేర్, ఆయాలు, శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఓ వైపు నిత్యావరసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని.. మరో వైపు జూన్ నెలలో పాఠశాలలు ప్రారంభం అవుతాయని తెలిపారు. తమ పిల్లలకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ ఎలా కొనుగోలు చేయాలని ప్రశ్నిస్తున్నారు.
28న ఆర్జీయూకేటీ ప్రవేశాల నోటిఫికేషన్
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ) : రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ) అడ్మిషన్ నోటిఫికేషన్ ఈ నెల 28న విడుదలకానున్నది. 2025-26లో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని వర్సిటీ వర్గా లు ప్రకటనలో తెలిపాయి. వివరాల కోసం www. rgukt.ac. in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరాయి. మహబూబ్‌నగర్‌లో కొత్త క్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఈ క్యాంపస్‌లో సీట్లు 180 వరకు ఉండొచ్చు.