హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు మెడికల్ కాలేజీ విద్యార్థుల ైస్టెపెండ్ సమస్యను పరిష్కరించాలని నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ బీఎన్ గంగాధర్‌ను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ కోరారు. శనివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఎన్ఎంసీ చైర్మన్‌తో బేగంపేటలోని టూరిజం ప్లాజాలో మంత్రి భేటీ అయ్యారు. ైస్టెపెండ్ విషయంలో విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులు అందజేసిన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని చైర్మన్‌కు మంత్రి అందజేశారు. రాష్ట్రంలో ఒకేసారి భారీ సంఖ్యలో కాలేజీలు పెరిగినందున, ఫ్యాకల్టీ సర్దుబాటు, బిల్డింగుల విషయంలో అవసరమైన మినహాయింపులు ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా పీజీ సీట్లు లేకపోవడం వల్ల, ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు ఇబ్బందులు పడుతున్నారని.. పీజీ సీట్ల సంఖ్యను కూడా పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ ఆహ్వానం మేరకు వెళ్లిన ఎన్ఎంసీ చైర్మన్ గంగాధర్.. విద్యార్థులు, టీచింగ్ ఫాకల్టీతో సమావేశమయ్యారు.
శాంతిచర్చలపై నేడు రౌండ్‌టేబుల్ సమావేశం
హైదరాబాద్ మే 31 (నమస్తే తెలంగాణ): సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు శాంతిచర్చల కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నామని పీస్ కమిటీ బాధ్యులు జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ జీ హరగోపాల్, కందిమల్ల ప్రతాప్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్‌రావు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఆమ్ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సుధాకర్, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, జాన్‌వెస్లీ, న్యూడెమొక్రసీ నేత వేములపల్లి వెంకట్రామయ్య తదితరులు పాల్గొంటారని వెల్లడించారు.