హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్‌గా సీహెచ్ ప్రియాంక సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ హరీశ్‌కుమార్ తెలంగాణ జెన్కో ఎండీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సీహెచ్ ప్రియాంకను సమాచార, పౌర సంబంధాలశాఖ స్పెషల్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. దీంతో స్పెషల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రియాంకకు సమాచార, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, మీడియా అకాడమీ అధికారులు అభినందనలు తెలిపారు. అదేవిధంగా జెన్కో ఎండీగా వెళ్లిన డాక్టర్ హరీశ్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. స్పెషల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సమాచారశాఖ కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులైన వల్లూరు క్రాంతి సోమవారం సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిశారు.