Private Schools | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 12 : విద్యాసంస్థలపై విద్యార్థి సంఘాల భౌతిక దాడికి నిరసనగా గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రైవేటు విద్యాసంస్థల బంద్కు వడుస్పా పిలుపునిచ్చింది. గురువారం వరంగల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల బంద్ పాటించాలని వారు పేర్కొన్నారు. పీడీఎస్యూ నాయకులు చందాల కోసం వెళ్లి స్కూల్ యాజమాన్యంపై దాడి చేయడం సీసీ కెమెరాలలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా పీడీఎస్యూ విద్యార్థి సంఘం నాయకులపై హనుమకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు, స్కూల్ యాజమాన్యంపై భౌతిక దాడికి నిరసనగా ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ బంద్కు పిలుపునిచ్చినట్లు, విద్యార్థి సంఘాలు చందాల దందా నుంచి విముక్తి కల్పించాలని వారు డిమాండ్ చేశారు.