నెక్కొండ, నవంబర్ 18: వరంగల్ జిల్లా నెక్కొండలో ఏర్పాటు చేసిన రెండు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో ప్రైవేట్ పత్తి నిల్వలు వెలుగుచూశాయి. గత శుక్రవారం సీసీఐ జీఎం తనిఖీల్లో ఈ విషయం బయటకు రాగా.. ఆయన ఆగ్రహం వ్యక్తంచేయడంతోపాటు ప్రైవేట్ పత్తి బయటకు వెళ్లే వరకు కొనుగోళ్లు నిలిపివేయాలని ఆదేశించారు. ఇందుకు బా ధ్యుడైన సీసీఐ పర్చేజింగ్ అధికారి సుశీల్‌పై బదిలీ వేటు వేశారు. ఈ విషయాన్ని మూడు రోజులుగా సంబంధిత అధికారులు గోప్యం గా ఉంచారు.
విషయం తెలియని రైతులు సోమవారం పలు వాహనాల్లో పత్తిని ఆయా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చారు. క్రయవిక్రయాలు లేక అక్కడే వేచి ఉండటంతో వాహనాలు బారులు తీరాయి. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చిన తర్వాత కొనుగోళ్లు ప్రారంభిస్తామని చెప్పడంతో రైతులు చేసేది లేక, గిట్టుబాటు ధర దక్కకపోయినా ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించారు. సీసీఐ మద్దతు ధర రూ.7,220 నుంచి రూ.7,521 వరకు ఉండగా.. ప్రైవేట్ వ్యాపారులు రూ.6,500 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేశారు.