హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఖైదీల్లో సంసరణ అనేది జైళ్ల శాఖతోపాటు మనందరి బాధ్యత అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
జైళ్లు ఆశలు, ఆకాంక్షల కు చిహ్నాలుగా మారాలని ఆకాంక్షిం చారు. ‘ఏడో ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్-2025’ సందర్భంగా ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో బుధవారం ఏర్పాటు చేసిన కల్చరల్ నైట్‌కు ఆయన హాజరై మాట్లాడారు.