హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): బీజేపీ రూపొందించబోయే మ్యానిఫెస్టోలో దివ్యాంగులకు ప్రాధాన్యం కల్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి అఖిల భారత దివ్యాంగుల హకుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఆయన మంగళవారం వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో సుమారు 15 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని, వీరిలో అత్యధికులు పేదలేనని చెప్పారు. వీరికి దివ్యాంగుల చట్టం-2016 అమలుకావడం లేదని, పథకాలు సరిగా అందడం లేదని వాపోయారు. మొత్తం 24 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఇందులో పింఛన్ పెంచాలని, ఉపాధికి చేయూత ఇవ్వాలని, ఉచిత ప్రయాణం కల్పించాలని.. తదితర డిమాండ్లు ఉన్నాయి.