కొల్లాపూర్ : ఏపీలోని కర్నూల్ పట్టణంలో గల ప్రసన్న లా కళాశాల(Prasuna Law College) ప్రిన్సిపాల్ శివాజీ రావు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పలువురు బాధిత విద్యార్థులు గురువారం ‘నమస్తే తెలంగాణ’తో వాపోయారు. సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజులను చెల్లించేందుకు వెళ్లిన విద్యార్థులపై ప్రిన్సిపాల్ స్థాయికి దిగజారి అసహ్యంగా ప్రవర్తించినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. డొనేషన్ల పేరుతో విద్యార్థులపై ఒత్తిడి తెచ్చి పరీక్ష ఫీజును కట్టించుకోకుండా ఫీజులు కట్టకపోతే చావండని ఉచిత సలహాలు ఇస్తున్నారని విద్యార్థులు వాపోయారు.
ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఫీజుల దోపిడీకి అక్రమ వసులకు పాల్పడుతున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలని, కళాశాల అక్రమాలపై విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్ శివాజీ రావుపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.