జూబ్లీహిల్స్/వలిగొండ, మే 12: ఎన్నికల విధుల్లో పాల్గొన్న గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఆదివారం గుండెపోటుతో మరణించారు. చంపాపేట్‌లోని మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ బొడ్డుపల్లి నర్సింహ (45) ఎన్నికల విధుల్లో భాగంగా నాంపల్లి నియోజకవర్గంలోని 151వ బూత్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వైద్య సహాయం అందించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పహిల్వాన్‌పురం గ్రామానికి చెందిన ఈయన 2021 మార్చి నుంచి ఇక్కడ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు భార్య, బాబు, పాప ఉన్నారు.