ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 7: ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువు తున్న విద్యార్థినిపై ప్రిన్సిపల్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కన్నబిడ్డలా చూసుకుంటూ విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే స్టూడెంట్‌పై లైంగికదాడి చేసిన ఘటన ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పట్టణానికి చెందిన దీనావన్ రావు.. సీతారాంపేట్ సమీపంలో లయోలా ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలను నడుపుతున్నాడు. పదో తరగతి చదువుతున్న విద్యార్థి (16)నితో అసభ్యంగా ప్రవర్తిస్తూ వస్తున్న ప్రిన్సిపల్.. బుధవారం లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లిన బాధితురాలు జరిగిన విషయం ఆమె తల్లికి చెప్పింది. దీంతో ఆమె తల్లి ఇబ్రహీంపట్నం పోలీస్టోస్టేషన్లో దీనావన్రావుపై ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు పంపిచామని ఏసీపీ రాజు తెలిపారు.
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ చర్యను నిరసిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల ముందు నిరసన తెలిపారు. బాలిక తల్లి సోమవారం పాఠశాలకు వచ్చి జనవరి 3 నుంచి తన బిడ్డ సిక్ లీవ్ పెట్టి స్కూల్‌కు రాకున్నా పాఠశాల యాజమాన్యం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది.
దీంతో హెడ్మాస్టర్ బాలిక ఇంటికి వెళ్లగా, జనవరి 2, 3 తేదీల్లో తనపై ముగ్గురు ఉపాధ్యాయులు లైంగిక దాడి చేశారని, అందులో ఇద్దరు తన క్లాస్ టీచర్లేనని బాధిత బాలిక తెలిపింది. బాలికపై లైంగిక దాడి ఘటన నేపథ్యంలో స్టాలిన్ సర్కార్‌పై విపక్షాలు ధ్వజమెత్తాయి.