హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్క చీటి సకులమ్మ(Sakalamma) మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Modi)సంతాపం ప్రకటించారు. ఈ మేరకు కేసీఆర్కు సంతాప సందేశాన్ని ప్రధాని పంపించారు. సోదరి మరణంతో బాధాతప్త హృదయంతో ఉన్న కేసీఆర్ కుటుంబ సభ్యులకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సకలమ్మ(82) హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసీఆర్కు సకలమ్మ 5వ సోదరి. ఆమె స్వగ్రామం రాజన్న సరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదిర గ్రామం. ఆమె భర్త హన్మంతరావు క్రితమే మృతి చెందరు. వారికి ముగ్గురు కుమారులు ఉన్నారు.
Letter