హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమ ఓట్ల నమోదును అరికట్టాలని తెలంగాణ స్టేట్ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్(టీఎస్సీపీఎస్ఈయూ) ఎన్నికల సంఘా న్ని కోరింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్‌గౌడ్.. ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. కార్పొరేట్ విద్యాసంస్థల నుంచి నమోదవుతున్న అక్రమ ఓట్లను అరికట్టి, బాధ్యులైన వారికి తగు మార్గదర్శకాలివ్వాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో సంఘం నేతలు శ్రవణ్‌కుమార్, మల్లికార్జున్, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓటరు నమోదు గడువు పొడిగించాలి: ట్రస్మా
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువును పొడగించాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసొసియేషన్ (ట్రస్మా) కోరింది. ఆన్లైన్ సహా నేరుగా దరఖాస్తుల సమర్పణ గడువును పొడిగించాలని విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు ఎన్నికల సంఘం అధికారులను కోరారు.