వెంగళరావునగర్, జనవరి 5: తల్లిదండ్రులే కన్నకూతురిపై దుర్మార్గంగా ప్రవర్తించారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని రహ్మత్‌నగర్‌లో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం రహ్మత్‌నగర్‌లో నివాసముండే దంపతులకు 14 ఏండ్ల కుమార్తె, 10 ఏండ్ల కుమారుడు ఉన్నారు. తల్లి ఉద్యోగం పేరుతో వెళ్లి చీకటిపడ్డాక ఇంటికి వచ్చేది. ఆమె వ్యభిచారం చేస్తున్నదని భర్తకూ తెలుసు. ఓ రోజు తల్లి ఫోన్లో మెస్సేజ్‌లు చదివిన కుమార్తె నిర్ఘాంతపోయింది. కూతురును కూ డా వ్యభిచారంలోకి దింపేందుకు య త్నించింది.
బాలికపై తల్లిదండ్రులు దాడి చేసి గదిలో బంధించారు. విటుడిని ఇంటికి పిలిచారు. అతడు రావడాన్ని గమనించిన బాలిక బాల్కనీ నుంచి పొరుగువారి సాయంతో బయటకు వచ్చి, రెండ్రోజులు తన స్నేహితురాలి ఇంటివద్ద తలదాచుకుంది. తన ఉపాధ్యాయులకు విష యం చెప్పింది. వారు చైల్డ్ హెల్ప్‌లైన్, పోలీసులకు తెలిపారు. పోలీసులు బాలికను ప్రభుత్వ సంరక్షణ కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని బాలిక తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నామని సీఐ శ్రీనివాస్ వివరించారు.