హైదరాబాద్ : హైదరాబాద్‌కు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్‌కు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ మెడల్( President medal) ఫర్ గ్యాలెంట్రీ పతకం దక్కింది. మాదాపూర్ సీసీఎస్‌లో పనిచేస్తున్న యాదయ్య(Yadaiah) అనే హెడ్ కానిస్టేబుల్ (Head constable)కు ఈ అవార్డు రావడం పట్ల రాష్ట్ర డీజీపీ జితేందర్ (DGP Jitender) , అడిషనల్ డీజీపీ సంజయ్‌కుమార్, ఐజీలు విజయ్‌కుమార్, రమేశ్ అభినందించి, శాలువాతో సన్మానించారు.
2022 జులై 25న నిరంజన్ నీలంనల్లి, రాహుల్ అనే ఇద్దరు చైన్‌స్నాచర్లు మహిళ మెడలోంచి గొలుసు లాక్కొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టిన హెడ్ కానిస్టేబుల్ యాదయ్య, కానిస్టేబుళ్లు రవి, దీబేష్ కేసును చాలేంజ్‌గా తీసుకుని సీసీ ఫుటేజీలు, బాధితురాలి వాంగ్ములం ప్రకారం విచారణ ప్రారంభించారు.
జులై 26వ తేదీన బొల్లారం ఎక్స్‌రోడ్‌లో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా వారిపై మారణాయుధాలతో దాడులు చేశారు. హెడ్ కానిస్టేబుల్ యాదయ్య చాతిపై కత్తితో దాడి చేసి పారిపోయేందుకు యత్నించారు. తీవ్రంగా రక్తమోడుతున్నా గాని ఇద్దరు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
తీవ్రంగా గాయపడ్డ యాదయ్య 17 రోజుల పాటు ఆస్పత్రిలో వైద్య చికిత్సల అనంతరం కోలుకున్నాడు. అనంతరం ఇద్దరు నిందితులను విచారించగా వీరు కర్ణాటకలోని గుల్బార్గ జిల్లా అశోక్‌నగర్ పోలీసు స్టేషన్‌పై దాడి, పలుచోట్ల దోపిడి, దొంగతనాలకు పాల్పడిన కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు.