అడవుల రక్షణతో అంతరించిపోతున్న జాతుల సంరక్షణ
అడవులను రక్షించడం ద్వారా అంతరించిపోతున్న మొక్కలు, వన్యప్రాణులను సంరక్షించుకోవచ్చని నాబార్డ్ ప్రాంతీయ చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల చింతల పేర్కొన్నారు.
- నాబార్డ్ ప్రాంతీయ చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల చింతల
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): అడవులను రక్షించడం ద్వారా అంతరించిపోతున్న మొక్కలు, వన్యప్రాణులను సంరక్షించుకోవచ్చని నాబార్డ్ ప్రాంతీయ చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల చింతల పేర్కొన్నారు. సోమవారం గచ్చిబౌలిలోని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ)లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్ల వారంరోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఈపీటీఆర్ఐ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుశీల చింతల హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ, అంతరించిపోతున్న మొక్కలు, వన్యప్రాణి జాతులను సంరక్షించేందుకు మొక్కల వర్గీకరణ, పరిమాణీకరణ పద్ధతులు ఉపయోగపడుతాయని తెలిపారు. కార్యక్రమంలో నాబార్డ్ ఏజీఎం స్వాతి తివారీ, నాబార్డ్ డీజీఎం సోమసుందరం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

