హైదరాబాద్ : తెలుగు వర్సిటీ మాజీ వీసీ, సాహితీవేత్త డాక్టర్ ఎల్లూరి శివారెడ్డికి సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రదానం చేశారు. రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ అవార్డు కింద సైటేషన్తో పాటు రూ.1,01,116 నగదును ఎల్లూరి శివారెడ్డికి అందజేశారు. మహాకవి దాశరథి సేవలను చిరస్మరణీయం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం సాహిత్యరంగంలో విశేషంగా కృషిచేసిన వారికి ప్రతిఏటా దాశరథి జయంతి అయిన జూలై 22న అవార్డు ఇస్తున్నది.
Presented the prestigious Daasarathi Krishnamacharyulu Award 2021 & a cash prize of Rs 1,01,116 to Dr Elluri Shiva Reddy Garu on behalf of State Govt at Ravindra Bharathi. pic.twitter.com/tQknvkbpJp
— V Srinivas Goud (@VSrinivasGoud) July 22, 2021