హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ): అయోధ్యలోని రామమందిరం దర్వాజల తయారీ పనులు పూర్తయ్యాయని హైదరాబాద్‌కు చెందిన అనూరాధ టింబర్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్వాహకుడు చదలవాడ శరత్‌బాబు తెలిపారు. వాటిని గురువారం రామమందిరంలో ప్రతిష్ఠ చేయనున్నట్టు వెల్లడించారు. ఆ దర్వాజల తయారీ కోసం 30 మంది కళాకారులు కృషి చేశారని వివరించారు. తమ సంస్థ చేపట్టిన ప్రాజెక్టుల్లో అయోధ్య ప్రాజెక్టు చాలా కీలకమైనదని, దేశానికి ఉపయోగపడే మరిన్ని ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆసక్తితో ఉన్నామని చెప్పారు.