హైదరాబాద్ : ప్రజా పాలన పేరుతో అబద్ధాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను నిలువునా మోసం చేస్తున్నాది. రేవంత్ రెడ్డి పాలనలో ఇన్నాళ్లు కరెంట్, సాగు, తాగు నీళ్లు లేక అల్లాడిన ప్రజలు నేడు వైద్యం అందక అరిగోస పడుతున్నారు. నాడు బీఆర్ఎస్ హయాంలో సర్కారు దవాఖానలు మెరుగైన వసతులతో కార్పొరేట్ హాస్పిటల్స్‌ను తలదన్నేలా వైద్య సేవలు(Medical treatment) అందించాయి. అదంతా గతం. కానీ, నేడు పరిస్థితులు మారిపోయాయి. సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న సోయి ప్రజల కష్టాలపై లేకపోయింది.
సీజనల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. చివరికి వైద్యం అందక గర్భిణులు(Pregnant women) సైతం ఇబ్బంది పడుతున్నారు. తాజాగా నల్లగొండ ప్రభుత్వ హాస్పిటల్లో(Nallgonda Government Hospital) డాక్టర్లు లేక గర్భిణులు అవస్థలు పడ్డారు. ఇద్దరు డ్యూటీ డాక్టర్లకు గాను.. ఆన్ డ్యూటీలో ఒకరే డాక్టర్ విధులు నిర్వహించారు. చెకప్ కోసం దాదాపు 100 మంది గర్భిణులు వచ్చారు. అయితే డ్యూటీ డాక్టర్ 20 మంది పేషంట్లను చూసి ఓపీ సేవలు నిలిపివేశారు. దీంతో వైద్యం అందక, ఓవైపు ఎండ వేడి, ఉక్కపోతలతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి మెరుగైన వైద్యం అందించాలని వారు కోరుతున్నారు.
నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేక గర్భిణీల అవస్థలు
ఇద్దరు డ్యూటీ డాక్టర్లకు గాను.. ఆన్ డ్యూటీలో ఒకరే డాక్టర్ విధులు.
చెకప్ కోసం వచ్చిన దాదాపు 100 మంది గర్భిణీలు.. 20 మంది పేషంట్లను చూసి OP నిలిపేసిన డ్యూటీ డాక్టర్.
ఎండ వేడి ఉక్కపోతలతో తల్లడిల్లుతున్న గర్భిణీ స్త్రీలు. pic.twitter.com/aG0eY8d65Q
— Telugu Scribe (@TeluguScribe) August 20, 2024