కొడంగల్, మార్చి 20 : చెప్పుకోవడానికే సీఎం ఇలాక.. వైద్య సేవలందక పక్క నియోజకవర్గాలకు వెళ్లాల్సిన దుస్థితి. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం లక్ష్మిపల్లికి చెందిన శిరీషను కాన్పుకోసం కుటుంబ సభ్యులు గురువారం అర్ధరాత్రి కొడంగల్ దవాఖానకు తీసుకొచ్చారు.
వైద్య సిబ్బంది పరిశీలించి కాన్పుకు ఇంకా సమయం ఉన్నదని, ఇక్కడ చిన్న పిల్లల డాక్టర్ లేరు, తాండూర్ ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలని సూచించారు. 108లో బయలుదేరగా కొడంగల్ నుంచి 4కిలోమీటర్లు వెళ్లగానే పురిటినొప్పులు అధికం కావడం తో 108 సిబ్బం ది డెలివరీ చేయ గా మగ బిడ్డను ప్రసవించింది.