హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ భవన్లో మంగళవారం ప్రీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్‌చేసి సంబురాలు జరిపారు. విద్యార్థులు తమ ఆటపాటలతో సందడిచేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ నేతలు మేడె రాజీవ్‌సాగర్, బొమ్మెర రామ్మూర్తి, కిశోర్‌గౌడ్, మన్నె గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.