హైదరాబాద్, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ): కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ పనులకు మూడు ప్రైస్ బిడ్లు దాఖలు కాగా ఆయా ఏజెన్సీలతో గురువారం ప్రీబిడ్ సమావేశం నిర్వహించాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫారసులకు అనుగుణంగా డిజైన్లు ఇచ్చేందుకు ఐదు సంస్థలు ఈవోఐ(ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్) దాఖలు చేయగా, అం దులో నాలుగు మాత్రమే సాంకేతిక అర్హత సాధించాయి. ఆయా సంస్థల నుంచి ఇటీవల ప్రైస్‌బిడ్లను ఆహ్వానించారు.
ఈ ఏడాది 43లక్షల ఎకరాలు ;యాసంగి తైబందీకి ఇరిగేషన్ శాఖ ప్రణాళికలు
హైదరాబాద్, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ) : 2025-26 యాసంగికి 43లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నీటి పారుదల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ(ఎస్సీఐఈఏఎం) ఈ ఎన్సీ అమ్జద్ హుస్సేన్, క్యాచ్మెంట్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(కాడా) సీఈ ధర్మ నేతృత్వంలో బుధవారం జలసౌధలో సమావేశమై చీఫ్ ఇంజినీర్లు చేసిన ప్రతిపాదనలపై ఈ కమిటీ చర్చించింది. రాష్ట్రవ్యాప్తంగా మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ప్రస్తుతం సాగునీటి వినియోగానికి 370.19టీఎంసీలు అం దుబాటులో ఉండగా, వాటితో దాదాపు 43లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని కమిటీ నిర్ణయించింది.