కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబర్ 9: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం కూకట్పల్లి రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన మహనీయుడని.. పదేండ్లు ముఖ్యమంత్రిగా రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని మాధవరం కొనియాడారు. కేసీఆర్ ఆరోగ్యం త్వరగా బాగుపడాలని దేవుడిని కోరుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ తులసీరావుతదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు త్వరగా కోలుకొని తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరుతూ భారత జాగృతి ఆధ్వర్యంలో భద్రాద్రి పుణ్యక్షేత్రంలో చేపట్టిన హోమం శనివారంతో ముగిసింది. శ్రీరాముడి సన్నిధిలో రెండు రోజులపాటు హోమాది ప్రత్యేక పూజలు నిర్వహించారు.