పోలీస్ కస్టడీని రద్దు చేయండి
ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో తనను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కింది కోర్టు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) డీఎస్పీ దుగ్యాల ప్రణీతకుమార్ అలియాస్ ప్రణీత్‌రావు హైకోర్టును కోరారు.
- ప్రణీత్‌రావు లంచ్ మోషన్ పిటిషన్
- పోలీసుల వివరణ కోరిన హైకోర్టు
హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో తనను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కింది కోర్టు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) డీఎస్పీ దుగ్యాల ప్రణీతకుమార్ అలియాస్ ప్రణీత్‌రావు హైకోర్టును కోరారు. వాస్తవ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కింది కోర్టు తనను పోలీస్ కస్టడీకి అప్పగించిందని, నిర్ధిష్టమైన షరతులేమీ విధించకుండానే కస్టడీ ఉత్తర్వులు జారీచేసిందని వివరిస్తూ మంగళవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. స్పష్టమైన గడువు నిర్ణయించకుండా పోలీస్ కస్టడీకి ఇవ్వడం చెల్లదని పేర్కొన్నారు.
కస్టడీ ఉత్తర్వులు లోపభూయిష్టంగా ఉన్నాయని, సుప్రీం కోర్టు జారీచేసిన మార్గదర్శకాలను అమలు చేయలేదని తెలిపారు. వాస్తవానికి ఈ నెల 18 (సోమవారం) నుంచి తనను పోలీస్ కస్టడీకి అప్పగించాల్సి ఉన్నప్పటికీ కింది కోర్టు 17 నుంచే కస్టడీకి అనుమతించిందని వివరించారు. రహస్యమంటూ పోలీసులు తనను బంజారాహిల్స్ స్టేషన్లో విచారిస్తున్నారని, ఈ విచారణకు తన బంధువులను, న్యాయవాదిని అనుమతించడం లేదని, దర్యాప్తు అంశాలను ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీక్ చేసి తన పరువుకు భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు.
పోలీసుల కస్టడీ, దర్యాప్తు నిర్ధిష్ట ప్రదేశంలో జరిగేలా చూడాలని, రోజూ పోలీసుల విచారణ పూర్తవగానే తనను తిరిగి జైలుకు తరలించేలా ఉత్తర్వులు ఇవ్వాలని, ఇంటరాగేషన్‌లో ఏఎస్పీ డీ రమేశ్ పాల్గొనకుండా కట్టడి చేయాలని కోరారు. దీంతో ఈ అత్యవసర పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని జస్టిస్ జీ రాధారాణి పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Rayapol SI | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు.. రాయపోల్ ఎస్ఐ స్ట్రాంగ్ వార్నింగ్
Abhijeet Dipke: విమానంలోనే దీప్కే అరెస్టు..
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

