హైదరాబాద్, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ) : కొత్తగా ఎన్నికైన ఏడుగురు ఎమ్మెల్సీలతో శాసనమండలి ఆవరణలో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యంతోపాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు శ్రీపాల్‌రెడ్డి, మల్క కొమురయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ఎమ్మెల్సీలకు సంబంధిత కిట్లను చైర్మన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : టీచర్ ఎమ్మెల్సీగా శాసనమండలిలో ఉపాధ్యాయుల గొంతుకను వినిపిస్తానని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం శాసనసమండలి ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ విద్య, ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారానికి తనవంతు ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు.