Prajapalana | నేటితో ముగియనున్న ప్రజాపాలన దరఖాస్తులు..
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజా పాలన (Prajapalana) దరఖాస్తులు నేటితో ముగియనున్నాయి. అభయ హస్తం పేరుతో ఐదు గ్యారంటీ లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు డిసెంబర్ 28న దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.
హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజా పాలన (Prajapalana) దరఖాస్తులు నేటితో ముగియనున్నాయి. అభయ హస్తం పేరుతో ఐదు గ్యారంటీ లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు డిసెంబర్ 28న దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటివరకు కోటి 8 లక్షలకుపైగా (1,08,94,115) దరఖాస్తులు అందాయి. శుక్రవారం ఒక్కరోజే 18,29,274 మంది అభయహస్తం దరఖాస్తులు సమర్పించారు. నేడు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు.
కాగా, దరఖాస్తుల గడువు పెంచేది లేదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకా దరఖాస్తు చేసుకోనివాళ్లు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పుడుపోతే మళ్లీ నాలులు నెలల తర్వాత గానీ అవకాశం రాదని తెలిపారు. ఇక ప్రజా పాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తులను ఈనెల 17వ తేదీలోపు కంప్యూటరీకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

