ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కు హైకోర్టులో ఊరట
హుస్సేన్‌సాగర్ ఎఫ్టీఎల్లో నిర్మాణాలున్నాయంటూ జీహెచ్ఎంసీ జారీచేసిన నోటీసుల వ్యవహారంలో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కు హైకోర్టులో ఊరట లభించింది.
- యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశం
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): హుస్సేన్‌సాగర్ ఎఫ్టీఎల్లో నిర్మాణాలున్నాయంటూ జీహెచ్ఎంసీ జారీచేసిన నోటీసుల వ్యవహారంలో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కు హైకోర్టులో ఊరట లభించింది. రాజ్‌భవన్ రోడ్డు సర్వే నం.22లోని ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ చేపట్టిన బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి సంబంధించి యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
ఈ నిర్మాణాలపై వారంపాటు కఠినచర్యలు తీసుకోరాదని జీహెచ్ఎంసీతోపాటు హైడ్రాను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. సోమాజిగూడలోని బహుళ అంతస్తుల భవనం నిర్మాణానికి సంబంధించి జీహెచ్ఎంసీ ఇచ్చిన షోకాజ్ నోటీసును రద్దు చేయాలని కోరుతూ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ పుల్లా కార్తీక్ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరఘురాం వాదనలు వినిపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

