‘పదవీ విరమణ చేసిన ఐఏఎస్, పోలీస్ అధికారులను తిరిగి ప్రభుత్వంలో నియమించ డం దారుణం. కేసీఆర్ ప్రభుత్వం తక్షణం ఇలాం టి అధికారులను తొలగించాలి. దీనిపై అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. రిటైర్డ్ అధికారులను ప్రభుత్వం నుంచి తొలగించాలి’ – 2020 జూన్ 25న పీసీసీ చీఫ్‌గా, మలాజిగిరి ఎంపీ హోదాలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య
‘ఆర్థిక, రెవెన్యూ, పోలీసుశాఖలతో పాటు సీఎంవోలో పలువురు విశ్రాంత అధికారులు సీఎం ప్రైవేటు సైన్యంగా పనిచేస్తున్నారు. వారందరినీ వెంటనే తొలగించాలి.’ -2023 అక్టోబర్ 13న పీసీసీ చీఫ్ హోదాలో ఢిల్లీలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య
హైదరాబాద్, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ): విశ్రాంత ఉద్యోగుల కొనసాగింపుపై అడ్డగోలు విమర్శలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పనిగా ఎక్స్టెన్షన్లు ఇస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. గతంలో పీసీసీ హోదాలో విశ్రాంత అధికారులను తొలగించాలన్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు సీఎంగా రిటైర్డ్ అధికారులను వివిధ పదవుల్లో కూర్చోబెడుతూ నాలుక మడతేశారు. ఇప్పటికే పలు శాఖల్లో విశ్రాంత అధికారులు కొనసాగుతుండగా, తాజాగా తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎండీసీ) ఎండీగా రిటైర్డ్ అధికారి సుశీల్‌కుమార్‌ను నియమించారు. ఐపీఎస్ అధికారి సం దీప్ శాండిల్య మే 31న ఉద్యోగ విరమణ పొందగా ఆ వెంటనే ఆయనకు నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్‌గా రేవంత్ సర్కారు బాధ్యతలు అప్పగించింది. ఇలా సలహాదారుల పేరున విశ్రాంత ఉద్యోగులను కొనసాగిస్తుండటంపై ఉద్యోగవర్గాలు విమర్శిస్తున్నాయి.
దసరా ఆదాయం నుంచి బాండ్ డబ్బులు చెల్లించండి ;యాజమాన్యానికి టీజీఎస్ఆర్టీసీ జేఏసీ డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): దసరా పండుగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ సాధించిన ఆదాయం నుంచి కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు టీజీఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, బీ యాదగిరి మాట్లాడారు. 2013 వేతన సవరణ బాండ్ డబ్బులను డ్రైవర్, కండక్టర్లు, గ్యారేజీ, సెక్యూరిటీ సిబ్బందికి చెల్లించి, మిగిలిన వారికి చెల్లించకపోవడంపై వారు అసంతృప్తితో ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం సంస్థకు వచ్చిన రూ.70 కోట్ల ఆదాయం నుంచి వారికి కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. అధిక పెన్షన్ కోసం నోటీసుల గడువును పెంచాలని రీజినల్ ప్రావిడెంట్‌ఫండ్ కమిషనర్, ఆర్టీసీ ఎండీకి బుధవారం విజ్ఞప్తి చేసినట్టు ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు.