జై నూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా(Asifabad District) జై నూర్ మండల కేంద్రంలో ఈనెల 21న నిర్వహించబోయే విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఏ డి ఈ ,డి. శ్రీనివాస్ ఒక ప్రకటనలో కోరారు. బుధవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించబోయే విద్యుత్ సమస్యల పరిష్కార కార్యక్రమానికి సిజిఆర్ఎఫ్ చైర్మన్ నారాయణ, సిజిఆర్ఎఫ్ మెంబర్స్ రామకృష్ణ ,కిషన్, రాజ గౌడ్ హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. జైనూర్ మండల కేంద్రంగా నిర్వహించబోయే ఈ కార్యక్రమానికి జై నూర్ కెరామెరి ,తిర్యాని, సిర్పూర్ యు, లింగాపూర్ మండలాల విద్యుత్ వినియోగదారులు హాజరై తమ విద్యుత్ సమస్యలను పరిష్కరించుకోగలరని ఆయన కోరారు.