గణపురం, జనవరి 8: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్ కాకతీయ థర్మల్ విద్యుత్తు కేంద్రంలో బుధవారం నుంచి విద్యుత్తు ఉత్పత్తి పునఃప్రారంభమైంది. కేటీపీపీ రెండో దశ 600 మెగావాట్ల ప్లాంటును 45 రోజులపాటు ఓవరాలింగ్ మరమ్మతు పనులు కోసం నవంబర్ 15న విద్యుత్తు ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు. 45 రోజులపాటు మరమ్మతులు పూర్తి చేసి విద్యుత్తు ఉత్పత్తిని పునఃప్రారంభించారు.