పుప్పాలగూడ, ఖానామెట్ భూముల వేలం వాయిదా
Govt Lands | రంగారెడ్డి జిల్లా పరిధిలోని పుప్పాలగూడ(గండిపేట మండలం), ఖానామెట్(శేరిలింగంపల్లి మండలం) భూముల వేలం వాయిదా పడింది. ఈ నెల 27, 28 తేదీల్లో జరగాల్సిన వేలంను వాయిదా వేస్తున్నట్లు టీఎస్ఐఐసీ

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా పరిధిలోని పుప్పాలగూడ(గండిపేట మండలం), ఖానామెట్(శేరిలింగంపల్లి మండలం) భూముల వేలం వాయిదా పడింది. ఈ నెల 27, 28 తేదీల్లో జరగాల్సిన వేలంను వాయిదా వేస్తున్నట్లు టీఎస్ఐఐసీ స్పష్టం చేసింది. ఈ భూముల వేలంపై పలువురు ఆయా కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో వాయిదాకు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. కొనుగోలుదారులకు పూర్తి స్థాయిలో భరోసా కలిగించేందుకు, కోర్టు కేసులు పరిష్కారం అయిన తర్వాతే వేలం ప్రక్రియ ఉంటుంది.
పుప్పాలగూడ, ఖానామెట్లో నిరూపయోగంగా ఉన్న 117.29 ఎకరాల ప్రభుత్వ భూములను ఈ– వేలం పద్ధతిలో విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలికవసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) ఈ ఏడాది ఆగస్టు నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ సర్వే నంబర్ 41/14లోని 22.79 ఎకరాల విస్తీర్ణంలోని 9 ప్లాట్లను విక్రయించాలని నిర్ణయించారు. దీంతో పాటు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలో 325, 326, 327, 328 సర్వే నంబర్లలోని 94.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మరో 26 ప్లాట్లను కూడా వేలం వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

