హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల కోసం నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలు వాయిదా వేసినట్టు గురువారం టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ప్రకటించారు. పేపర్ కోడ్ 19, 28కి సంబంధించి డిసెంబర్ 2న నిర్వహించాల్సిన పరీక్షలను డిసెంబర్ 7కి వాయిదా వేశారు. అంతకుముందు ఈ నెల 26న జరగాల్సిన పేపర్ కోడ్ 141 పరీక్షను కూడా డిసెంబర్ 8కి మార్చారు. 30 నుంచి అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు www.tspsc.gov.inను సంప్రదించాలన్నారు.
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్ లెక్చరర్లకు ఎంపికైన అభ్యర్థుల జాబితా గురువారం టీజీపీఎస్సీ విడుదల చేసింది. www.tspsc.gov.inలో జాబితాలు అప్లోడ్ చేశారు. ఈసీఈ, ఈఐఈ, ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, లెక్చరర్ ఇన్ లెటర్ ప్రెస్ వంటి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసి తుది జాబితా విడుదల చేశారు. వివరాలకు వెబ్సైట్ను సంప్రదించాలని టీజీపీఎస్సీ సెక్రెటరీ నవీన్ నికోలస్ తెలిపారు.