హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): 2025-26 విద్యాసంవత్సరానికి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ కోర్సులకు ఫిబ్రవరి 5 నుంచి 12 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు కాళోజీ హెల్త్ వర్సిటీ తెలిపింది. ఫిబ్రవరి 16 నుంచి కోర్సు ప్రారంభించనున్నట్టు వెల్లడించింది.
ఎండీ, ఎంఎస్, డీఎన్బీ లేదా పీజీ డిప్లొమా చేసిన వారు అర్హులని, పీజీ డిప్లొమా అభ్యర్థులు ఏడాదిపాటు పీజీ సెంటర్లో పని చేసి ఉండాలని తెలిపింది. ఇతర దేశాల్లో చదివిన మెడికల్ పీజీ ఉత్తీర్ణులైన వారు సైతం ఈ కోర్సులకు అర్హులని పేర్కొన్నది.