హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ గాంధీ అని వైసీపీ నేత, సినీ రచయిత పోసాని కృష్ణమురళి అభివర్ణించారు. రాష్ట్రం వచ్చేందుకు ముఖ్య కార ణం కేసీఆరేనని తెలిపారు. హైదరాబాద్లో గురువారం ఆయన మీడియా తో మాట్లాడుతూ.. ‘ఇకపై నేను రాజకీయా లు మాట్లాడను. నా జీవితాంతం రాజకీయాల జోలికి పోను. నా చివరి శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతా. ఇన్నేండ్ల్ల జీవితంలో నేను ఎవరికీ తలవంచలేదు’ అని పేర్కొన్నారు. ఆడవాళ్లనే ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారు.. తాను మగవాడినని, తనను తిట్టరా? అయినా, వాటిని పట్టించుకోనని తెలిపారు.