జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : డబుల్ బెడ్రూం ఇండ్ల జాబితాలో తన పేరు లేదని ఓ నిరుపేద మహిళ మనోవేదనతో తుదిశ్వాస విడిచిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్లే.. భూపాలపల్లిలోని జవహర్‌నగర్‌కాలనీ లో అద్దె ఇంటిలో నివాసం ఉండే తాడికొండ సమ్మక్క (55) భర్త కొన్నేళ్ల క్రితమే చనిపోవడంతో కుమారులు అరవింద్, అభిరాంతో కలిసి అంబేద్కర్ సెంటర్లో పండ్ల దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నది. కూ తురు కల్పనకు పెళ్లి జరిపించింది. బీఆర్ఎస్ హయాంలో కేటీకే 5 ఇైంక్లెన్ వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలోని 11వ బ్లాకులో సమ్మక్కకు మాజీ ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఇల్లు కేటాయించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ జాబితాలోని పేర్లు మార్పుచేస్తూ కొత్త జాబి తా తయారు చేశారు. ఈ జాబితాలో పేరురాని సమ్మక్కతోపాటు లబ్ధిదారులు డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద ధర్నా లు, ఆందోళనలు, వంటావార్పు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలలుగా లబ్ధిదారులను ఫైనల్ చేయకపోవడంపై మండిపడ్డారు.
మనోవేదనతోనే అనారోగ్యం: సమ్మక్క కుమారుడు అరవింద్
డబుల్ బెడ్రూం ఇండ్ల జాబితాలో తన పేరును కాంగ్రెస్ నాయకులు తొలగించారని తెలుసుకున్న సమ్మక్క ఎమ్మెల్యేతో పాటు కౌన్సిలర్, అధికారుల చుట్టూ తిరుగుతున్న క్రమంలో అనారోగ్యానికి గురైందని సమ్మక్క కుమారుడు అరవింద్ తెలిపారు. తమకు భూమి, ఇల్లు లేదని, వచ్చిన ఇల్లును రాకుం డా చేస్తున్నారని రోజూ ఇంట్లో చెప్పుకుంటూ ఏడ్చేదన్నాడు. ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఇల్లు రాకుండా చేశారన్న మనోవేదనతో అనారోగ్యానికి గురికాగా ఆదివారం రాత్రి దవాఖానకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ సొమవారం మృతి చెందిందని ఆవేదన వ్యక్తంచేశాడు. అద్దె ఇంటి వారు నిరాకరించడంతో మృతదేహాన్ని అక్క ఇంటికి తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించామని విలపించాడు.
అధికారుల అప్రమత్తం ?
సమ్మక్క మృతి వార్త, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డబుల్ బెడ్రూం ఇండ్ల జాబితాలో సమ్మక్క పేరు చేర్చినట్టు ప్రచారం. అధికార పార్టీ నాయకులు మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమ్మక్క పేరు చేర్చి గతంలో తయారు చేసిన జాబితాలో ఆమె పేరు ఉంది అని చెబుతున్నట్టు సమాచారం. పేదలకు పంచే ఇండ్లలో రాజకీయాలు వద్దు. బీఆర్ఎస్ హయాంలోనే జాబితా తయారు చేసి పంపిణీ చేశామని మాజీ కౌన్సిలర్ గండ్ర హరీశ్‌రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే సమ్మక్క మనోవేదనతో అనారోగ్యానికి గురై మృతి చెందిందని ఆయన తెలిపారు.