వికారాబాద్/మర్పల్లి, డిసెంబర్ 3 : వికారాబాద్ జిల్లా మర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో నాణ్యతలేని అన్నం వడ్డించడంతో మంగళవారం విద్యార్థులు తినలేక పడేశారు.. పాఠశాలలో 160 మంది విద్యార్థులు ఉన్నా రు. కొన్ని రోజులుగా మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉంటున్నదని, ముద్దలు ముద్దలుగా రావడంతో పాటు కూరలు కూడా మొ క్కుబడిగా చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎంఈవో అంజిలయ్య స్పందిస్తూ తమకు వచ్చే బి య్యం సరిగ్గా లేవని సమాధానమిచ్చారు.
విద్యార్థుల చావులకు రేవంతే బాధ్యుడు ; ఏడాదైనా విద్యాశాఖకు మంత్రే లేడు: బీఆర్ఎస్ నేత అరవింద్శర్మ
ఆర్కేపురం, డిసెంబర్ 3 : గురుకుల పాఠశాలల విద్యార్ధుల చావులకు సీఎం రేవంత్రెడ్డి కారణమని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్శర్మ, ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేశ్ ఆరోపించారు. అల్కాపురిలోని ప్రభుత్వ పాఠశాలను మంగళవారం సందర్శించారు. పాఠశాలలోని మౌ లిక సదుపాయాలు, మధ్యాహ్నం భోజన నాణ్యత గురించి ప్రిన్సిపల్ అనిత, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా విద్యాశాఖకు మంత్రినే నియమించకుండా నిర్లక్ష్యం చేసినట్టు విమర్శించారు.